శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

ఏపీలో మరో మూడు జిల్లాల్లో రిలయన్స్ జియో 5జీ సేవలు

5gspectrum
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు జిల్లాల్లో రిలయన్స్ జియో తన 5జీ సేవలను విస్తరించింది.  ఏపీలో విస్తరించిన జిల్లాల్లో ఉమ్మడి చిత్తూరు, కడప, ఒంగోలు జిల్లాలు ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లో ప్రస్తుతానికి కేవలం చిత్తూరు, ఒంగోలు, కడప పట్టణాల్లోనే ఈ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. జిల్లాలోని ఇతర గ్రామీణ ప్రాంతాలకు ఈ సేవలు విస్తరించేందుకు మరికొంత సమయం పట్టొచ్చని సమాచారం. 
 
అలాగే, దేశ వ్యాప్తంగా మరో 50 నగరాలకు, పట్టణాలకు రిలయన్స్ జియో 5జీ సేవలను విస్తరించింది. ఇదే అంశంపై రిలయన్స్ జియో ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ విడలో 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో 5జీ విస్తరించామని, భారీ సంఖ్యలో నగరాలు, పట్టణాల్లో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకునిరావడం ఆనందంగా ఉందని తెలిపింది. 
 
కాగా, తాజా విస్తరణతో దేశంలోని 184 నగరాలు, పట్టణాల్లో జియో సంస్థ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే, కొత్తగా 5జీ ప్రవేశపెట్టిన ప్రాంతాల్లోని జియో వినియోగదారులు తమ వెల్కమ్ ఆఫర్‌ను ఉపయోగించుకోవాలని జియో సూచించింది. 1జీబీపీఎస్‌ను మించిన వేగంతో అపరిమిత డేటాను వినియోగించుకోవచ్చని, ఇందుకోసం ఎలాంటి అదనపు రుసుు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది.