మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 12 మే 2017 (20:16 IST)

దేశ ప్రజలను రెండుగా చీల్చాలని పవన్ ప్లాన్... జర్నలిస్టు గోస్వామి ఫైర్

తితిదే ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించడంపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన దగ్గర్నుంచి ఆయనకు అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ పలువురు వ్యక్తులు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ వ్యాఖ్యలపై మోహన్ బాబు కౌంటర్ ఇచ్చారు. తాజాగా ప్రముఖ జర్నలిస్టు అర్ణబ్ గోస్వ

తితిదే ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించడంపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన దగ్గర్నుంచి ఆయనకు అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ పలువురు వ్యక్తులు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ వ్యాఖ్యలపై మోహన్ బాబు కౌంటర్ ఇచ్చారు. తాజాగా ప్రముఖ జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ మంచి నటుడు కావచ్చు కానీ అతడు మంచి పౌరుడు మాత్రం కాదని అన్నారు.
 
ఉత్తరాదివారు దక్షిణాదివారిపై చిన్న చూపు చూస్తున్నారని పవన్ చేస్తున్న ప్రసంగాలు దేశ ప్రజలను రెండుగా చీల్చేవిగా వుంటున్నాయని అన్నారు. పవన్ కల్యాణ్ తన స్వార్థ ప్రయోజనాల కోసమే ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఎదురైందంటూనే, దేశంలో అంతా సమానమేనన్న విషయం పవన్ కల్యాణ్ గుర్తించాలన్నారు.