ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 7 జూన్ 2021 (19:13 IST)

చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఎన్టీఆర్‌కు జెండాలు

తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో నమ్మకం పూర్తిగా పోతోందన్నది విశ్లేషకుల భావన. అందుకే ఆ పార్టీ నుంచి చాలామంది వలసలు వెళ్లిపోతున్నారని..ఎ పిలోనే కాదు తెలంగాణాలోను అదే పరిస్థితి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ బాధ్యతలు వేరొకరికి అప్పజెబితే బాగుంటుందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే ఉంది.
 
ఎమ్మెల్యేగా చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ జెండాలు వెలిశాయి. రాజకీయాల్లోకి ఎన్టీఆర్ రావాలంటూ ఏకంగా జెండాలు ప్రింట్ చేసి ఇళ్ళపై ఎగురవేశారు అభిమానులు, పలువురు టిడిపి కార్యకర్తలు.
 
ఇప్పుడిదే టిడిపిలో హాట్ టాపిక్‌గా మారుతోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఎందుకిలా ఎన్టీఆర్ అభిమానులు ప్రవర్తిస్తున్నారంటూ టిడిపిలో ముఖ్య నేతలు ఆలోచనలో పడ్డారు. గతంలో కూడా ఇదేవిధంగా ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు కుప్పం ప్రాంత వాసులు.
 
అంతటితో ఆగలేదు. గతంలో ఎన్టీఆర్ పార్టీ కోసం జనంలోకి వెళ్ళి ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసినప్పుడు జనంలో బాగా మార్పు వచ్చింది. పార్టీ ఓడిపోయినా సరే జనంలో తెలుగుదేశంపై నమ్మకం పెరిగింది. ప్రస్తుతం తెలుగుదేశం గడ్డు పరిస్థితుల్లో ఉంది. కాబట్టి పార్టీ అధ్యక్షుని మార్పు జరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయంలో ఉన్నారట కుప్పం నియోజకవర్గ ప్రజలు.