బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (12:16 IST)

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. అశోక్‌గజపతిరాజు పిలుపు

తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని.. ఆ డిమాండ్‌ను అందరూ కలిసి ముందుకు తీసుకెళ్లాలని ఆ పార్టీ సీనియర్‌ నేత పూసపాటి అశోక్‌గజపతిరాజు పిలుపునిచ్చారు. తెదేపా మహానాడు రెండోరోజు ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. 
 
రాజకీయరంగంలో ఎన్టీఆర్ అందించిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. పేదల వద్దకు సంక్షేమాన్ని తీసుకొచ్చిన నేతల ఎన్టీఆర్‌ అని కొనియాడారు. 
 
దేశ రాజకీయాల్లో అన్ని పార్టీలనూ ఏకం చేసేందుకు ఆయన ఓ వేదికను ఏర్పాటు చేసినట్లు అశోక్‌ గుర్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలను ఆచరించే దిశగా అందరూ కృషి చేయాలని నేతలకు సూచించారు.
 
మరోవైపు ప్రజలు ఎన్టీఆర్‌ని దేవుడులా భావించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా అచ్చెన్న మాట్లాడుతూ తెలుగుజాతి నలుములల చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. 
 
రాజకీయాల్లో వచ్చి నూతన ఓరవడి సృష్టించారని గుర్తుచేశారు. సినీ రంగంలో తెలుగు జాతికి ఎన్టీఆర్ మంచి పేరు తెచ్చారన్నారు. తెలుగు జాతికి సేవ చేయాలని సినీ రంగాన్ని విడిచి పెట్టి రాజకీయంలోకి వచ్చారన్నారు. రాజకీయలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో చైతన్యం తెచ్చారని తెలిపారు. 
 
నేడు పిల్లకాకి సంక్షేమం కోసం మాట్లాడుతున్నారని.. సంక్షేమం అంటే ఆనాడు ఎన్టీఆర్ పెట్టినవే అని గుర్తు చేశారు. ఆనాడు జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసి పోరాటం చేసిన ఘనత ఎన్టీఆర్‌దని అచ్చెన్న పేర్కొన్నారు. కాంగ్రెస్ ను ఎదురించి అన్ని పార్టీలను ఎన్టీఆర్ ఎకం చేసిన ఘనత ఎన్టీఆర్ అని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని విమర్శించారు. ప్రతి పక్ష పార్టీలపై దాడులు, కుట్రలు జరుగుతున్నాయన్నారు. 
 
కేసులు బెదిరింపులుతో ప్రతిపక్షాన్ని అణిచి వేయ్యాలని చేస్తున్నారని మండిపడ్డారు. ఎంత అణిచివేస్తే అంత పైకి లేగుస్తామన్నారు. రాష్ట్రంలో 1983 నాటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయన్నారు. ఎన్టీఆర్ సాక్షిగా టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.