పాలకులపై కె.ఎ.పాల్ ధ్వజం, మరోవైపు విజ్ఞప్తి!
కె.ఎ. పాల్, ఈ పేరు ప్రపంచానికి తెలిసిందే. ఒకప్పుడు దేవుడి బిడ్డ. కాలపరిస్థితుల వల్ల ఇప్పుడు ఆ దేవుని బిడ్డను సామాన్యుడిగా మారిపోయాడు. అయినా తన సందేశాన్ని తెలపాలని ఓ రాజకీయ పార్టీ కూడా పెట్టాడు. ఇదంతా ఒక భాగం. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. దీనికి కారకులెవరు అనేది తెలిసిందే. చైనానే అంటూ ఆయన గట్టిగా చెబుతూనే, మన రాజకీయ నాయకులు, పాలకులు ముందస్తు ఆలోచన లేనివారంటూ ఘాటుగానే స్పందించాడు. వారివల్లే కరోనా వ్యాప్తి చెందిందంటూ విజయవాడ నుంచి బుధవారంనాడు ఆన్‌లైన్‌లో మాస్క్పెట్టుకుని ఆన్‌లైన్‌లో మాట్లాడారు.
జనాలతో సభలు పెట్టడం న్యాయమేనా!
ఒకవైపు కారులో మాస్క్‌లేకుండా వెళితే 200 రూపాయలు, లేదా వెయ్యి రూపాలు ఫైన్ వేస్తున్నారు. మరి వందలాదిమందిని పోగుచేసి మాస్క్‌లు లేకుండానే సభలు పెడుతున్నారు. ఇదెక్కడి న్యాయం. ఇదెక్కడి ముందుచూపు అంటూ ధ్వజమెత్తారు. కరోనా వ్యాప్తి వచ్చేసింది. ఆక్సిజన్ సిలెండర్లు అందడంలేదు. పాలకులు ముందుగా ఎందుకు చర్యలు తీసుకోలేదని సామాన్యుడిగా ప్రశ్నిస్తున్నారు.
పేషెంట్ల కోసం నా బిల్డింగ్‌లు ఉపయోగించుకోండి
ఇక ఆంధ్ర ప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి విపరీతంగా వుంది. బయట రోడ్లమీద జనాలు తిరగాలంటే భయపడుతున్నారు. పేషెంట్లు ఎక్కవయ్యారు. ఆసుప్రతులు ఖాళీలేవు. నాకు సంబంధించిన బిల్డింగ్‌లు వున్నాయి. వాటిని పేషెంట్ల కోసం ఉపయోగించుకోండి. గతంలోనూ చెప్పా. ఇప్పుడూ చెబుతున్నా. వందలాది బెడ్లు సరిపడా స్థలాల బిల్డింగ్‌లు అవి అంటూ తన ఉదారతను చాటుకున్నారు.
ఇంకోవైపు టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.