అపరిశుభ్రత.. ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థినులకు అస్వస్థత
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఏలేశ్వరం బాలయోగి గురుకుల బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో 20 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పాఠశాలలోని వంట గదిలో ఆహారం నిల్వ ఉంచిన అపరిశుభ్రతే ఈ ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమని విద్యార్థినుల తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనకు ముందు ఇదే గురుకుల పాఠశాలలోని వంటగదిలో అపరిశుభ్రతపై గతంలో వార్తాపత్రికల్లో కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తలను పాఠశాల సిబ్బంది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు.