బీజేపీ మంత్రులను పక్కనబెట్టిన చంద్రబాబు... టీడీపీ - బీజేపీ మైత్రి చెడినట్టేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ సర్కారులో బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా చేస్తున్నారు. వీరందరికీ నిన్నామొన్నటివరకు సముచిత స్థానమే కల్పించారు. అయితే, జ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ సర్కారులో బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా చేస్తున్నారు. వీరందరికీ నిన్నామొన్నటివరకు సముచిత స్థానమే కల్పించారు. అయితే, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకంలో మాత్రం బీజేపీకి చెందిన మంత్రులను పూర్తిగా చంద్రబాబు విస్మరించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
వచ్చే ఎన్నికల కోసం వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇప్పటినుంచి సిద్ధమవుతున్నారు. అదేసమయంలో ఈ ఎన్నికల్లో బీజేపీతో ఆయన జట్టు కట్టవచ్చన్న ఊహాగానాలు వినొస్తున్నాయి. అందుకే బీజేపీకి చెందిన మంత్రుల్లో ఒక్కరిని కూడా ఇన్‌ఛార్జ్ మంత్రులుగా నియమించలేదన్న వాదనలు వినొస్తున్నాయి. అలాగే, టీడీపీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిని కూడా అవమానించారు. జిల్లాల ఇన్‌చార్జి మంత్రుల నియామకంలో ఆయనకు చోటు దక్కలేదు. ఏ జిల్లాకూ ఇన్‌చార్జి మంత్రిగా ఆయనను నియమించలేదు. కేబినెట్‌లో అందరికంటే సీనియర్ అయినా ఆయనను సీఎం చంద్రబాబు పక్కనపెట్టడం గమనార్హం.
బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావును పూర్తిగా విస్మరించడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ-బీజేపీ విభేధాల నేపథ్యంలో ఈ ఇద్దరు మంత్రులను పక్కనపెట్టారన్న వాదనలు విన్పిస్తున్నాయి. అనంతపురం ఇన్‌చార్జిగా కామినేని శ్రీనివాస్ స్థానంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు స్థానం కల్పించడం గమనార్హం.