కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపాశేషు ప్రమాణం
కాపు కార్పొరేషన్ చైర్మన్ గా అడపా శేషు ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. విజయవాడలో అడపా శేషుతో కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా మంత్రి పేర్ని నాని ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన అడపా శేషు తాను కాపుల సంక్షేమo కోసం కృషి చేస్తానని చెప్పారు.
కాపులు అన్ని రంగాల్లో రాణించాలని, వారి అభ్యున్నతి కోసమే సీఎం జగన్మోహన్ రెడ్డి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారని వివరించారు. కాపులలో ఉన్న అణగారిన వర్గాలకు, పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు కార్పొరేషన్ ద్వారా సేవ చేస్తానన్నారు.
ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ, అన్ని కులాల వారికి అండగా ఉంటూ, అందరి అభ్యున్నతికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు. అడపా శేషు అటు విజయవాడ కార్పొరేటర్‌గా ఇటు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా రాణించాలని అన్నారు.