గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Updated : శనివారం, 31 జులై 2021 (21:14 IST)

మీ భార్యాబిడ్డల గురించి ఒక్కసారి ఆలోచించండి: రౌడీషీట‌ర్ల‌కు ఎస్పీ మల్లికా గార్గ్ కౌన్సెలింగ్

ప్ర‌కాశం జిల్లాలో రౌడీ షీట‌ర్ల‌కు ఎస్పీ మ‌ల్లికా గార్గ్ త‌న‌దైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. చెడు మార్గంలోకి వెళ్ళే ముందు ఒక్క‌సారి, మీ కుటుంబ స‌భ్యుల‌ను, భార్యాబిడ్డ‌ల‌ను గుర్తుచేసుకోండ‌ని వారికి హిత‌బోధ చేశారు.
 
రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ సూచించారు. శనివారం ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని పలు పోలీసుస్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లకు ఆమె కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, చెడు నడత మానకపోతే, నిండైన జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఇక నుంచి అయినా, గత జీవితం మొత్తం మర్చిపోయి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని రౌడీ షీటర్లను హెచ్చరించారు. ఎక్కడ ఉన్నా ప్రతి వారం తమ పరిధిలోని పోలీసు స్టేషన్లో హాజరు కావాలని, అక్క‌డ సంత‌కం చేసి వెళ్ళాల‌ని ఆమె రౌడీ షీటర్లను ఆదేశించారు.