శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 31 జులై 2021 (16:45 IST)

రాజమండ్రి జైలులో దేవినేని ఉమ‌కు ప్రాణహాని: అచ్చెన్న‌ాయుడు

రాజమండ్రి జైలులో మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ప్రాణహాని ఉంద‌ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆయనకు హానిచేసే ఉద్దేశంతోనే ఆ జైలు సూపరింటెండెంట్‌ను ఆకస్మికంగా మార్చార‌ని అన్నారు.

దేవినేని ఉమాను రాజమండ్రి జైలుకు తరలించగానే అక్కడి జైలు సూపరింటెండెంట్‌ రాజారావును ఆకస్మికంగా బదిలీ చేసి కిశోర్‌కుమార్‌ అనే అధికారిని నియమించార‌ని ...ఇది ఎందుకు చేశార‌ని అచ్చెన్నాయుడు ప్ర‌శ్నించారు. దేవినేనికి హాని తలపెట్టే ఉద్దేశంతోనే ఈ మార్పు చేశార‌ని, తప్పుడు కేసులు పెట్టి ఉమను జైలుకు పంపింది గాక అక్కడ కూడా ప్రాణహాని తలపెట్టడానికి కుట్రలు చేయడం దారుణమ‌న్నారు.

జైల్లో ఉన్న ప్రత్యర్థులను హతమార్చిన చరిత్ర వైసీపీ నేతలకు ఉంద‌ని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఉమకు ఎటువంటి హాని జరిగినా దానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల‌న్నారు. సూపరింటెండెంట్‌ ఆకస్మిక బదిలీకి కారణాలను ప్రభుత్వం చెప్పాలి అని అచ్చెన్న డిమాండ్‌ చేశారు.