సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : శనివారం, 6 మే 2017 (16:46 IST)

కర్నాటకలో దారుణం... భార్యకు అశ్లీల చిత్రాలు... అడిగినందుకు పొడిచేశారు...

కర్నాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ దుకాణంలో కొన్ని రోజుల క్రితం ఓ మహిళ మొబైల్ రీచార్జ్ చేసుకుంది. ఆ సమయంలో ఆ మహిళ ఫోన్ నెంబరును దుకాణం యజమాని సేవ్ చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఆ మహిళకు నగ్న ఫోటోలు,

కర్నాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ దుకాణంలో కొన్ని రోజుల క్రితం ఓ మహిళ మొబైల్ రీచార్జ్ చేసుకుంది. ఆ సమయంలో ఆ మహిళ ఫోన్ నెంబరును దుకాణం యజమాని సేవ్ చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఆ మహిళకు నగ్న ఫోటోలు, సందేశాలు పంపిస్తూ వేధింపులు ప్రారంభించాడు. 
 
అతడి సందేశాలకు, నగ్న చిత్రాల దాడికి బెంబేలెత్తిపోయిన మహిళ తన భర్త మహదేవ్‌కు విషయాన్ని చెప్పింది. దీనితో అతడు సదరు షాపు యజమాని యోగేష్ చేష్టలపై అతడు ప్రశ్నించాడు. మహదేవ్ ప్రశ్నించడంపై ఆగ్రహం చెందిన దుకాణాదారుడు తన స్నేహితులతో కలిసి అతడిపై కత్తులతో దాడి చేశాడు. దానితో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. 
 
ఘటనా స్థలం నుంచి యోగేశ్ అతడి మిత్రులు పరారయ్యారు. స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.