శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 12 జులై 2018 (21:17 IST)

అది పాడింది కత్తి మహేషేనా...? శ్రీరాముడి పాట (video)

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి దుమారం సృష్టించిన కత్తి మహేష్ హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. ఆరు నెలల పాటు ఆయన హైదరాబాదులో అడుగు పెట్టకూడదంటూ హైదరబాద్ నగర పోలీసులు నోటీసు ఇచ్చి మరీ ఆయన స్వస్థలం చిత్తూరులో దించి వచ్చారు. ఈ నేపధ్యంల

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి దుమారం సృష్టించిన కత్తి మహేష్ హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. ఆరు నెలల పాటు ఆయన హైదరాబాదులో అడుగు పెట్టకూడదంటూ హైదరబాద్ నగర పోలీసులు నోటీసు ఇచ్చి మరీ ఆయన స్వస్థలం చిత్తూరులో దించి వచ్చారు. ఈ నేపధ్యంలో కత్తి మహేష్ అక్కడే వుంటున్నారు. ఐతే తాజాగా కత్తి మహేష్ తను విమర్శలు చేసిన శ్రీరామ చంద్రుడు గురించి వున్న ఓ ప్రార్థనా శ్లోకాన్ని పాడి ఆశ్చర్యానికి గురి చేశారు.
 
శ్రీరాముడు పాటను చూసిన నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు. అది కత్తి మహేష్ ఆలపించినది కాదని కొందరంటుంటే మరికొందరు కత్తి... శభాష్... చాలా బాగా పాడారు. శ్రీరాముడిపై ఇంత భక్తి వున్న మీరు అలా ఎలా మాట్లాడారు అంటూ ప్రశ్నలు స్పందిస్తున్నారు. మొత్తమ్మీద మళ్లీ కత్తి గురించి చర్చ మొదలైంది. కత్తి మహేష్ ఆలపించిన శ్రీరాముడు శ్లోకాన్ని మీరూ చూడండి ఈ వీడియోలో...