శుక్రవారం, 18 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 18 సెప్టెంబరు 2016 (11:18 IST)

తాగొచ్చిన భర్త.. వేధింపులు తట్టుకోలేక భార్య, అత్త నిప్పంటించారు.. ఎక్కడ?

కుటుంబ కలహాలు ఓ వ్యక్తి ప్రాణాలు తీశాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ వ్యక్తిపై అతని భార్య, అత్త కలిసి కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి చోటు

కుటుంబ కలహాలు ఓ వ్యక్తి ప్రాణాలు తీశాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ వ్యక్తిపై అతని భార్య, అత్త కలిసి కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఇరగదిండ్ల గంగయ్య(30) గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై భార్యతో గొడవ పడుతున్నాడు. 
 
ఈ క్రమంలో శనివారం రాత్రి మరోసారి వారి మధ్య వివాదం చెలరేగింది. దీంతో విసిగిపోయిన భార్య రజిత, ఆమె తల్లితో కలిసి గంగయ్యపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు భార్య, అత్తను విచారిస్తున్నారు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.