ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (13:59 IST)

బెండకాయ కూరేనా అంటూ భర్త వాగ్వివాదం.. పురుగుల మందు తాగేసిన వివాహిత

బెండకాయ కూర ఓ వివాహిత ప్రాణాలను బలితీసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం మంచరామికి చెందిన సదయ్య విజయ దంపతులు నివసిస్తున్న

బెండకాయ కూర ఓ వివాహిత ప్రాణాలను బలితీసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం మంచరామికి చెందిన సదయ్య విజయ దంపతులు నివసిస్తున్నారు. సదయ్య ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సదయ్య శుక్రవారం నాడు ఉదయం పూట డ్యూటీకి వెళ్ళే సమయంలో భార్య బెండకాయ కూరతో అన్నం వడ్డించింది. 
 
కానీ బెండకాయ కూర విషయమై భార్యతో భర్త గొడవపడ్డాడు. ప్రతిరోజూ బెండకాయ కూరేనా అంటూ భార్యతో వాగ్వాదానికి దిగాడు. కానీ ఈ విషయమై భర్త మందలింపులతో తీవ్ర మనస్థాపానికి చెందిన విజయ ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. శుక్రవారం రాత్రి పూట పురుగుల మందుతాగేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ ఘటనపై బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.