శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 14 జులై 2018 (11:18 IST)

నారా లోకేశ్ అడిగితే నా సీటు ఇచ్చేస్తా.. చంద్రబాబుపై కృష్ణంరాజు ప్రశంస

మంత్రి నారా లోకేశ్‌ అడగాలేగానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట సీటు ఇచ్చేస్తానని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. లోకేష్ అడిగితే తాను ప్రాతినిథ్యం వహిస్

మంత్రి నారా లోకేశ్‌ అడగాలేగానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట సీటు ఇచ్చేస్తానని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. లోకేష్ అడిగితే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న చిలకలూరిపేట సీటును ఇచ్చేస్తానని తెలిపారు. లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేసినా సీటు ఇవ్వడానికి 175 నియోజకవర్గాల్లోని టీడీపీ అభ్యర్థులంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 
 
నారా లోకేష్‌కు సీటు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నామని ప్రత్తిపాటి అన్నారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు తాము సిద్ధంగా లేమని ఐదేళ్లు పాలించాలని తమకు ప్రజలు అధికారాన్ని ఇచ్చారని తెలిపారు. ఓటమి భయంతోనే బీజేపీ ముందస్తుకు వెళ్లేందుకు యత్నిస్తోందని ధ్వజమెత్తారు.
 
ఇదిలా ఉంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ నేత, సినీ నటుడు కృష్ణంరాజు ఎట్టకేలకు ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో కష్టపడుతున్నారని కితాబిచ్చారు. వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ కల్యాణ్‌లకు బీజేపీ స్క్రిప్ట్ ఇస్తోందనే వార్తలను కృష్ణంరాజు కొట్టిపారేశారు.

అవన్నీ అసత్యపు వార్తలన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో బీజేపీపై ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో బీజేపీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.