మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 8 మార్చి 2020 (11:18 IST)

దుర్గా అమ్మవారికి లగడపాటి 143 గ్రాముల బంగారు హారం

మాజీ పార్లమెంట్ సభ్యులు లగడపాటి రాజగోపాల్ కుటుంబ సమేతముగా శ్రీ దుర్గామల్లేశ్వర అమ్మవారి పంచ హారతులు సేవలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

అనంతరం శ్రీ అమ్మవారి పంచహారతుల సేవానంతరము వీరికి వేదపండితులు వేద ఆశీర్వచనము చేసి అమ్మవారి శేషవస్త్రము, ప్రసాదము, చిత్రపటమును అందజేసినారు.

అనంతరము లగడపాటి రాజగోపాల్ దంపతుల వారు అమ్మవారి అలంకరణ నిమిత్తం సుమారు 143 గ్రాముల బరువు గల బంగారు రాళ్ళ హారంను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబుకి సమర్పించారు.

ఈ హారము నందు 66 తెలుపు రాళ్ళు, 81 ఎరుపు రాళ్ళు , 42 పచ్చ రాళ్ళు, 15 బంగారు పూసలు మరియు బంగారు ముత్యపు పూసలు ఉన్నవి.