దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.1.35 కోట్లు
ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్దానంలోని మహామండపంలో హుండీల్లో భక్తులు వేసిన కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎం.వి.సురేష్ బాబు పర్యవేక్షించారు. 16 రోజులకుగాను 31 హుండీల్లో కానుకలను లెక్కించగా రూ.1,35,64,872 నగదు, 310 గ్రాముల బంగారం, 4-150 కిలోగ్రాములు వెండి వస్తువులను భక్తులు కానుకల రూపంలో జగన్మాత దుర్గమ్మకు సమర్పించారు