1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 8 మార్చి 2020 (11:09 IST)

సింహాచలం ట్రస్టు బోర్డు చైర్మన్ క్రిష్టియనా?

అత్యంత పవిత్రమైన సింహాచలం ట్రస్టు బోర్డు చైర్మన్ గా అర్ధరాత్రి జీవోతో ప్రమాణ స్వీకారం చేసిన సంచయిత క్రిష్టియన్ మత ఆచారాలను అమితంగా ఇష్టపడేవారని విశ్వసనీయంగా తెలిసింది.

ఆమె తల్లి ఉమా గజపతి రాజు, పూసపాటి ఆనంద గజపతి రాజు నుంచి విడాకులు తీసుకున్న అనంతరం పునర్వివాహం చేసుకున్నారు. ఆమె పునర్వివాహం చేసుకున్న రమేష్ శర్మ క్రైస్తవుడు అనే విషయం వెల్లడి అవుతున్నది.

ఆయన క్రమం తప్పకుండా క్రిస్టమస్ జరుపుకునేవారు. ఆయనతో బాటు ఉమా గజపతి రాజు కూడా క్రిస్టమస్ సెలబ్రేషన్స్ లో పాల్గొనేవారు. మారుతండ్రి, తల్లితో బాటు సంచయిత కూడా క్రిష్టమస్ సెలబ్రేషన్స్ జరుపుకునేవారు.

క్రైస్తవ మత ఆచారాలు అనుసరించే కుటుంబంలో పెరిగిన సంచయిత ను ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం (సింహాచలం) ట్రస్టు బోర్డు చైర్మన్ గా, మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మన్ సాస్) చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది.

తనను నియమించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమని సంచయిత చెబుతున్నారు. తాను సేవ చేయడానికి మాత్రమే ఈ పదవిని స్వీకరించారని కూడా అంటున్నారు.