సోమవారం, 14 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 అక్టోబరు 2024 (11:24 IST)

నేడే ఏపీలో మద్యం దుకాణాల కోసం లాటరీ

liquor
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీలో భాగంగా, ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా, 89,882 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.1797.64 కోట్ల ఆదాయం వచ్చింది. అనంతరం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు రావడంతో వాటిని పునఃపరిశీలంచాలని అబ్కారీ శాఖ భావిస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలోని 113 మద్యం దుకాణాలకు అత్యధికంగా 5764 దరఖాస్తులు అందినట్టు అధికారులు వెల్లడించారు. 
 
కాగా, ఏపీలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం లాటరీ పద్దతిలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియను చేపట్టనున్నారు. దీంతో దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 15వ తేదీన ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగించనున్నారు. దీంతో 16వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది.