శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , మంగళవారం, 17 ఆగస్టు 2021 (11:33 IST)

తిరుమల శ్రీవారి సేవ‌లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా!

తిరుమల తిరుప‌తిలో శ్రీవారిని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్నలోక్ స‌భ‌ స్పీకర్​కు తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ.సుబ్బారెడ్డి ఇతర అధికారులు కలిసి స్వాగతం పలికారు.

శ్రీ‌వారి మూలమూర్తిని దర్శించుకున్న ఆనంతరం రంగనాయకుల మండపంలో పండితులు స్పీక‌ర్ కుటుంబానికి వేదాశీర్వచనం చేశారు. తితిదే ఛైర్మన్ స్పీకర్​ను శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెంట రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారు. తిరుమ‌ల ద‌ర్శ‌నం త‌న‌కు ఎంతో సంతృప్తిని ఇచ్చింద‌ని, వేంక‌టేశ్వ‌ర స్వామి వారి దయ‌కు త‌మ కుటుంబం పాత్రులైనందుకు ఆనందాన్ని వ్య‌క్తం చేశారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.

గ‌త నెండు రోజులుగా స్పీక‌ర్ చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఈ ప్రాంతంలోని ప్ర‌ముఖ దేవాల‌యాల‌ను అన్నింటినీ కుటుంబ స‌మేతంగా చుట్టి వ‌స్తున్నారు. ఆయ‌న వెంట ఎంపీ విజ‌య‌సాయి ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.