శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 6 ఆగస్టు 2021 (19:59 IST)

మాస్కులు తీసేసి ప్రశాంతంగా రోడ్లపై నడిచే పరిస్థితి రావాలని కోరుకున్నా: డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన ప్రశంసనీయమన్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. 
 
దర్శనం తర్వాత ఆలయం వెలుపల మీడియాతో డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనలోనూ, విద్యార్థుల ఉన్నతవిద్యకు పెద్దపీట వేయడంలోను ముఖ్యమంత్రి చొరవ అభినందనీయమన్నారు. కరోనా బాధితులను ఆదుకోవడంలోనూ, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడం లోనూ సిఎం సఫలీకృతులయ్యారన్నారు. 
 
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. చాలా రోజుల తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉందన్నారు. మాస్కులు తీసేసి ప్రశాంతంగా రోడ్లపై నడిచే పరిస్థితి రావాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. కరోనా ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోవాలని కూడా శ్రీవారిని ప్రార్థించానన్నారు డిప్యూటీ స్పీకర్.