మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శనివారం, 10 జులై 2021 (22:06 IST)

నా కొత్త ప్రాజెక్టును ఆశీర్వదించమని శ్రీవారిని ప్రార్థించా: నమిత

ప్రముఖ సినీ నటి నమిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భర్త వీరేంద్రచౌదరితో  కలిసి స్వామిసేవలో ఆమె పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆలయం వెలుపల మీడియతో నమిత మాట్లాడారు. నమిత థియేటర్స్, నమితా ఫిలిం ఫ్యాక్టరీ పేరుతో కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు.
 
కరోనా తగ్గుముఖం పట్టడంతో తమ ప్రాజెక్టులు సక్సెస్ కావాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు నమిత తెలిపారు. బౌబౌ అనే సినిమాలో నటించానని.. ఆ సినిమాను ఓటిటిలో విడుదల చేయడం ఇష్టం లేదని.. అందుకే సినిమా థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్థంగా ఉన్నామన్నారు. 
 
చాలారోజుల తరువాత తిరుమల శ్రీవారిని దర్సించుకున్నట్లు నమిత చెప్పారు. స్వామివారి దర్సనం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని.. తన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉందని నమిత తెలిపారు. ఆలయం వెలుపల నమితతో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీలు పడ్డారు.