శనివారం, 9 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (19:54 IST)

గో సంరక్షణపై ప్రత్యేక దృష్టి - టిటిడి ఇఓ కె. ఎస్. జవహర్ రెడ్డి

గోమాతను రక్షించడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గో సంరక్షణ కోసం మూడు గోశాలను తిరుమల, తిరుపతి పలమనేరు అభివృద్ధి చేస్తామని.. తిరుమలలో స్వామివారి నైవేద్యానికి దేశీయ ఆవుల పాలతోనే తయారీ చేస్తామన్నారు టిటిడి ఇఓ కె.ఎస్.జవహర్ రెడ్డి.
 
25 గిరి ఆవులవు విరాళంగా అందించారని,త్వరలోనే ఆ ఆవులు తిరుమలకి వస్తాయన్నారు. స్వామి వారి నైవేద్యాలకి 30 కేజీల నెయ్యి అవసరమని... ఇందుకోసం 250 నుండి 300 అవులు అవసరం కూడా ఉందన్నారు. ఏడు కొండల్ని ప్రతిభింబంగా ఏడు రకాల దేశీయ ఆవులు ఏర్పాటు చేయనున్నామని..వీటితోనే వచ్చిన పాలతో నెయ్యి తయారి చేయిస్తామన్నారు.నూతన సేవ ప్రారంభం, నవనీత సేవ ప్రారంబించాలని టిటిడి నిర్ణయించిందన్నారు. 
 
పెరుగును చిలికి వెన్న తీసి భక్తులతో ఊరేగింపుగా చేసే సేవ.. త్వరలోనే ప్రారంభమవుతుందని.. గోశాల అన్నింటిని శాస్త్రీయ నిర్వహించడం కోసం ఇందుకో నిపుణుల తీసుకువస్తామన్నారు. గో సంరక్షణ ట్రస్టుకి యస్వీ వెటర్నరీ యునివర్సిటీ తో ఎంఓయు ఒప్పందం కుదిరిందని.. గోశాలకు అవసరమైన ఆహారం యునివర్సిటీ ద్వారా తీసుకొంటామన్నారు. గోశాలలో మగ ఆవులతో గైనకాలజీ విభాగంతో కలిసి గోవులను సంరక్షిస్తామన్నారు.
 
గ్రీన్ ఎనర్జీ వినియోగం కోసం, తిరుమలని కాలుష్య రహితంగా తీర్చి దిద్దుతామని.. ఇందుకోసం 35 ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు. చేయనున్నామని.. 35 టాటా ఎనక్స్ వాహనాలు ఉద్యోగులు కేటాయిస్తామన్నారు. నెలకి 32 వేల చొప్పున చెల్లిస్తారు..ఐదు సంవత్సరాల అనంతరం వాహనాలు సొంతం అవుతుందన్నారు.
 
21-22 డైయిరీలు, క్యాలండర్లు 12 లక్షలు ముద్రించేందుకు నిర్ణయించామని..రెండు లక్షల చిన్న డైరీలు ముద్రిస్తామన్నారు ఇఓ. చిన్న జియర్ స్వామి రాయలసీమలో పర్యటించి ఆలయాల అభివృద్ధి గురించి సూచనలు చేయాలన్నారు. మొత్తం పది ఆలయానికి 10 కోట్లు రూపాయల‌ టిటిడి నిధులు కేటాయించామన్నారు. 
 
చిత్తూరులో వాయిల్పాడు లో ఆలయన్ని పూర్తి స్థాయిలో రాతి నిర్మాణం ఆరు కోట్లు కేటాయించామని.. నెల్లూరు జిల్లాలో సీతారామ స్వామి ఆలయానికి నిర్మాణం.. 80 లక్షలు మంజూరు చేశామన్నారు. బర్డ్ చిన్న పిల్లల కార్డియాక్ ఆసుపత్రి సివిల్ పనులు,యాంత్రాలు కొనుగోలుకి 2.3 కోట్లు కేటాయింపు జరిగిందన్నారు. భద్రత బలోపేతం కోసం సిసి కెమెరాలు ఏర్పాటుకి 2 కోట్ల నిధులు కేటాయించామని.. స్వామివారి దీపారాధన కి నెయ్యి, భక్తులు విరాళంగా ఇవ్వవచ్చని, దేశీయ ఆవు నెయ్యి ఇవ్వాలన్నారు.
 
రాష్ట్రంలో 5 లక్షల మంది రైతులు గోఆధారిత వ్యవసాయం చేస్తున్నారని..రైతులతో ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి, టిటిడి అవసరమైన ముడిసరుకు కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అగరబత్తులు తయారీ ఆగష్టు 15న భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని.. 15రకాల పంచగవ్య ఉత్పత్తులు తమిళనాడులో చేయిస్తున్నట్లు చెప్పారు. 
 
.ఏడి భవనంలో బెంగుళూరు చెందిన కంపెనీకి ఓ ప్లాన్ తయారు చేసారని.. సన్నిధి గొల్ల పోస్టుల బర్తీ చేయ్యడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. శ్రీవాణికి ప్రయారిటీ దర్శనం, ఇప్పట్లో దర్శనాల‌ సంఖ్య పెంచేది లేదన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. శ్రీవాణి ట్రస్టుకి 150 కోట్ల రూపాయలు అందిందని.. శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో ఊరికొక గుడిని‌ నిర్మిస్తామన్నారు. తిరుమలలో టిటిడి స్పెస్ఫైడ్ అథారిటీ కమిటీ సమావేశమైంది.