బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (17:59 IST)

ఇకపై కాలుష్య రహిత తిరుమల : స్పెసిఫైడ్ అథారిటీ నిర్ణయం

ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం స్పెసిఫైడ్‌ అథారిటీ శుక్రవారం సమావేశమైంది. అథారిటీ చైర్మన్‌ జవహర్‌ రెడ్డి అధ్యక్షతన తొలిసారి ఈ సమావేశం జరిగింది. తిరుమల అభివృద్ధి పనుల నిధుల కేటాయింపుపై సమావేశంలో చర్చించారు. 
 
ముఖ్యంగా, తిరుమలను కాలుష్య రహిత క్షేత్రంగా మార్చేందుకు 35 ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలుకు ఈ అథారిటీ నిర్ణయించింది. అలాగే, బర్డ్‌ చిన్నపిల్లల ఆస్పత్రిలో వైద్య పరికరాల కొనుగోలుకు రూ.2.3 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. 
 
అదేవిధంగా నెల్లూరు జిల్లాలో సీతారామస్వామి ఆలయ నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరుకు నిర్ణయం తీసుకుంది. త్రిదండి చినజీయర్‌ స్వామి సూచనల మేరకు 10 ఆలయాల పునర్నిర్మాణం కోసం రూ.9 కోట్లు వినియోగించాలని నిర్ణయించారు.  
 
స్వామివారి ప్రసాదానికి వినియోగించే నెయ్యి తయారీలో భక్తుల భాగస్వామ్యం, నవనీత సేవ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు.. మరికొనిర్ణయాలు తీసుకున్నారు.