గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 23 జులై 2021 (22:41 IST)

అంతా అయిపోయింది, ఇక మిగిలింది నియామకమే: మంత్రి వెల్లంపల్లి

తిరుమల శ్రీవారిని దేవదాయాశాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు దర్సించుకున్నారు. ఆలయంలో టిటిడి అధికారులు ఘనస్వాగతం పలికి మంత్రి కుటుంబానికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు.
 
ఆలయం వెలుపల మీడియాతో మంత్రి మాట్లాడారు. టిటిడి పాలకమండలికి సంబంధించిన పేర్లను ఇప్పటికే పరిశీలించాం. ఆశావహులందరూ చాలామందే ఉన్నారు. ముఖ్యమంత్రి వారిలో కొంతమంది పేర్లను ఖరారు  చేశారు.
 
అతి త్వరలోనే టిటిడి పాలకమండలి నియామకం పూర్తవుతుందని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. అలాగే కోవిడ్ మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టే విధంగా రాష్ట్రప్రజలపై స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్సించుకోవడం కోసం మరింత సంతోషంగా ఉందన్నారు మంత్రి.