గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 23 జులై 2021 (22:00 IST)

అత్యాచారం చేసినవాడిని వేటాడాల్సిందే: తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

ఏపీ అసెంబ్లీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసిన దిశ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...  దిశ యాప్ ద్వారా సమాజంలో మార్పు రావాలని, మృగాలుగా మారిన మగవాళ్లను క్షమించరాదని అన్నారు.
 
ఇలాంటి మృగాల విషయంలో అవసరమైతే చట్టాలను పక్కనబెట్టి వేటాడాలనీ, అత్యాచారాలకు పాల్పడే వారు భూమిపై ఉండేందుకు పనికిరారని చెప్పారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు తిరిగిన పుణ్యభూమిలో ఇలాంటి దుర్మార్గాలకు చోటు లేదనీ, చెల్లి, కుమార్తె ఇలా ఎలాంటి వావివరసలు లేని పశువుల్లా ప్రవర్తిస్తూ పసిమొగ్గలను చిదిమేస్తున్న వారిని అంతం చేయాల్సిందేనని అన్నారు.