సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 మే 2021 (22:42 IST)

ఏపీ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని దంపతులకు కరోనా

ఏపీ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంతోపాటు ఆయన సతీమణి తమ్మినేని వాణిశ్రీ కరోనా బారినపడ్డారు. సీతారాం భార్యకు వారంరోజుల క్రితం కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో శ్రీకాకుళంలోని మెడికల్‌ కేర్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. 
 
నాలుగు రోజుల తరువాత తమ్మినేనికి సైతం కోవిడ్‌ లక్షణాలు కనిపిండచడంతో ఆయన కూడా అదే దవాఖానలో చికిత్స నిమిత్తం చేశారు.
 
ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నామని ఇద్దరి పరిస్థితి నిలకడగానే ఉందని దవాఖాన వైద్యులు తెలిపారు. స్పీకర్‌ తమ్మినేనిని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్‌లో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.