సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శుక్రవారం, 23 జులై 2021 (18:59 IST)

ప్ర‌కాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత‌!

విజ‌య‌వాడ‌లోని ప్రకాశం బ్యారేజీకు వరద నీరు భారీగా వ‌చ్చి చేరుతోంది. రాష్ట్రంలో ఎగువన కురుస్తున్న భారీగా వర్షాలు కారణంగా ప్రకాశం బ్యారేజీకు ఇలా వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజీకి ఇన్ ఫ్లో : 61,311 క్యూసెక్కులు ఉంది. ఔట్ ఫ్లో : 59,750 క్యూసెక్కులు వ‌దులుతున్నారు. దిగువ ప్రాంతాల్లో పంట పొలాల సాగుకు : 1561 క్యూసెక్కులు నీటిని వ‌దులుతున్నారు.

ప్ర‌కాశం బ్యారేజి మొత్తం నిల్వ సామర్ధ్యం : 3.07 టీఎంసీలు. పై నుంచి వ‌చ్చి వ‌ర‌ద నీటితో ప్ర‌కాశం బ్యారేజి 10 గేట్లను 2 అడుగులు మేర ఎత్తి నీటిని వ‌దులుతున్నారు. అలాగే, 60 గేట్లను అడుగు అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఇరిగేష‌న్ అధికారులు వెల్లడించారు.

ప్ర‌కాశం బ్యారేజికి దిగువ‌న ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నీటి ఫ్లో ఇంకా పెరిగిన‌ట్లయితే, ప‌ల్ల‌పు ప్రాంతాలు మునిగిపోయే అవ‌కాశం ఉంది. అందుకే కృష్ణా న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాల వారిని అధికారులు అప్ర‌మ‌త్తం చేస్తున్నారు.