మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శుక్రవారం, 6 ఆగస్టు 2021 (18:38 IST)

ఒలంపిక్ మెడ‌ల్‌ని ఆస‌క్తిగా ప‌రిశీలించిన సీఎం జ‌గ‌న్

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. టోక్యో ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించిన సిందును సీఎం జగన్ అభినందించారు. వెలగపూడి సచివాలయంలో తనను కలిసిన పీవీ. సిందూను సీఎం జగన్ ఈ సందర్భంగా సత్కరించారు.
 
మీ ఆశీర్వాదంతో పతకం సాధించానని సింధు సీఎం జగన్ తో అనగా... దేవుడి దయతో మంచి ప్రతిభను కనభరిచారు అని సీఎం ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పీవీ సిందుకు ముప్పై లక్షల రూపాయలు సీఎం జగన్ ప్రకటించారు.

అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ, విశాఖలో వెంటనే అకాడమీని ఏర్పాటు చెయ్యాలని కోరారు. భవిష్యత్తులో ఇంకా చాలా మంది సింధులు తయారు కావాలని ఆకాంక్షించారు. విశాఖ‌లో బ్యాడ్మింట‌న్ అకాడ‌మీ ఏర్పాటుకు సింధుకు 2 ఎక‌రాల స్థ‌లం సీఎం జ‌గ‌న్ కేటాయించారు. ఇందులో అకాడ‌మీ త్వ‌ర‌గా ఏర్పాటు చేస్తే, ఏపీకి మంచి క్రీడాకారులు త‌యార‌వుతార‌ని ఆకాంక్షించారు.