జగన్‌ని కలిసిన పీవీ సింధు : దుర్గమ్మ సన్నిధిలో ఒలింపిక్ విజేత
ఒలింపిక్ విజేత సింధు ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం చేసుకుంది. బెజవాడ కనకదుర్గ దేవస్థానానికి దర్శనానికి వచ్చిన క్రీడాకారిణి సింధుకి పూర్ణకుంభంతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. సింధు కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానంతరం సింధుకు వేదాశీర్వచనం చేసిన వేద పండితులు శుభం శభం అని దీవెనలు అందించారు.
అమ్మవారి ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని సింధుకు ఆలయ ఈఓ భ్రమరాంబ అందజేశారు. పి.వి.సింధు మాట్లాడుతూ, టోర్నమెంట్ కు వెళ్లేముందు అమ్మవారి దర్శనానికి వచ్చాను, విజేతగా ఇపుడు
ఆలయానికి దర్శనానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంకా టోర్నమెంట్లు ఆడాల్సి ఉంది...
2024లో కూడా ఒలింపిక్స్‌లో ఆడాలి... ఈసారి స్వర్ణం సాధించాలి అని తన ఆకాంక్షను వెల్లడించారు.