శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By జెఎస్కె
Last Modified: మంగళవారం, 3 ఆగస్టు 2021 (16:53 IST)

పి.వి.సింధుకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘ‌న స్వాగ‌తం

భార‌త దేశ ఖ్యాతిని ఇనుమ‌డిస్తూ, టోక్యోలో కాంస్య ప‌త‌కాన్ని సాధించిన బ్యాడ్మంట‌న్ క్రీడాకారిణి పి.వి.సింధుకు అభిమానం వెల్లువెత్తుతోంది. టోక్యో నుంచి భార‌త్ కు తిరిగి వ‌చ్చిన తెలుగు తేజం సింధుకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.

ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పి వి సింధుకు ఢిల్లీ విమానాశ్రయంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, విమానాశ్రయ అధికారులు, క్రీడా శాఖ, బ్యాడ్మింటన్ అకాడమీ అధికారులు స్వాగ‌తం ప‌లికారు. సింధుకు అభినంద‌న‌లు తెలిపి, రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున న‌గ‌దు పుర‌స్కారాన్ని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే.