1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 ఆగస్టు 2021 (12:39 IST)

గూగుల్‌లో పీవీ సింధు కులం గురించే అధికంగా వెతికారట.. జేజేలు అంటోన్న పవన్

టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు సంబంధించిన వివరాల కోసం గూగుల్‌లో అత్యధిక మంది వెతికారు. ఇదే సమయంలో మరో ఆశ్చర్యకరమైన సంగతి వెల్లడైంది. బంగారు పతకం కోసం సింధు పోటీ పడిన సందర్భంలో.. గతంలో సాధించిన విజయాల గురించి కాకుండా ఆమె కులం ఏమిటో తెలుసుకునేందుకు కొంత మంది ప్రయత్నించారు. గూగుల్ సెర్చ్‌లో ఆమె కులం కోసం వెతికారు.
 
గూగుల్ సెర్చ్ బాక్స్ లో సింధు కోసం శోధించిన వాటిలో ఆమె కులం మోస్ట్ సెర్చెడ్ కీవర్డ్ గా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సింధు వివరాల కోసం గూగుల్ లో వెతికారు. పీవీ సింధు, పీవీ సింధు విన్స్, పీవీ సింధు కాస్ట్ పేరుతో ఎక్కువ మంది శోధించారు. పీవీ సింధు, పీవీ సింధు విన్స్, పీవీ సింధు కాస్ట్ వెతికారు.
 
కాగా, చిన్న వయస్సులో ఒలింపిక్స్ లో పతకం సాధించిన భారత క్రీడాకారణిగా పీవీ సింధు ఘనతెక్కింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆదివారం కాంస్య పతకం గెలుపొందింది. 
 
మహిళల సింగిల్స్‌లో భాగంగా చైనాకి చెందిన హి బింగ్జియావోతో తలపడిన పీవీ సింధు 21-13, 21-15 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుపొందిన పీవీ సింధు.. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకం సాధించిన షట్లర్‌గా రికార్డ్ నెలకొల్పింది.
 
మరోవైపు పీవీ సింధుకు ప్రశంసల వర్షం కురుస్తోంది. బ్యాడ్మింటన్ సింగిల్ మహిళల విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకొని భారతదేశానికి గర్వకారణమైన పీవీ సింధుకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసలు తెలిపారు. పి.వి.సింధుకి నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. తన కాంస్య పతకం భారతదేశం జెండాను రెప రెపలాడేలా చేసిన పీవీ సింధుని చూసి దేశమంతా ఎంతగానో గర్విస్తోంది అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు.
 
పీవీ సింధు పోరాట పటిమ గురించి ఎంత చెప్పిన తక్కువే అని ఒలింపిక్స్ వేదిక సైతం సింధుని చూసి గర్వపడుతుందని జేజేలు కొట్టారు. పీవీ సింధు ఇకపై ఇలాంటి ఘన విజయాలు ఎన్నో సాధించాలని ఆయన కోరుకుంటూ ఆమె తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. పి.వి.సింధు భవిష్యత్తులో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు పవన్ కళ్యాణ్