సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (11:27 IST)

ఒక్కో కంపెనీ నుంచి రూ.5 కోట్ల నష్టపరిహారం కోరనున్న పీవీ సింధు

టోక్యో ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో కాంస్య పతకం సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ షెట్లర్ పీవీ సింధు పలు బ్రాండ్ కంపెనీల నుంచి రూ.5 కోట్ల (ఒక్కో కంపెనీ నుంచి) నష్టపరిహారాన్ని కోరారు. తన చిత్రాలను అనధికారికంగా ఉపయోగించినందుకు ఆమె ఈ కంపెనీలకు నోటిసులు పంపనున్నారు. 
 
టోక్యో ఒలింపిక్స్ 2021లో సింధు కాంస్య పతకం గెలిచిన సందర్భంగా ఆమెను అభినందిస్తూ ఆదిత్య బిర్లా గ్రూప్, హ్యాపీడెంట్, విక్స్, పాన్ బహార్, అపోలో హాస్పిటల్స్‌తో సహా పెర్ఫెట్టి వాన్ మెల్లె, పి అండ్ జి, లాంటి కంపెనీలు తమ బ్రాండ్ ను ప్రమోషన్ చేసుకున్నాయి. 
 
సింధు అనుమతి లేకుండా ఆమె చిత్రాలను ఆయా కంపెనీలు తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఉపయోగించాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థపై సింధు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. 
 
సింధుకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలను నిర్వహించే స్పోర్ట్స్ మార్కెటింగ్ ఏజెన్సీ, ఆమె తరపున లీగల్ నోటీసులను పంపనుంది. వీటిలో ప్రతి కంపెనీ నుండి రూ.5 కోట్ల నష్టపరిహారం కోరనున్నారు.