మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , సోమవారం, 16 ఆగస్టు 2021 (10:52 IST)

చిత్తూరు జిల్లాలో లోక్‌సభ స్పీకర్ ఓం ప్ర‌కాశ్ బిర్లా పర్యటన

లోక్‌సభ స్పీకర్‌ ఓంప్రకాశ్‌ బిర్లా రెండు రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. నేటి మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన మధ్యాహ్నం 1.30గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు.

సాయంత్రం 5.30 గంటలకు తిరుమల చేరుకుని శ్రీకృష్ణ వసతి గృహంలో బస చేయనున్నారు. ఎల్లుండి ఉదయం విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుంటారు. పద్మావతి అతిథిగృహంలో తితిదే అధికారులతో సమీక్షించనున్నారు. తిరుమల ధర్మగిరి వేదపాఠశాలను సందర్శిస్తారు.

అనంతరం తిరుపతి కపిలేశ్వరస్వామిని, శ్రీకాళహస్తి వాయులింగేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. లోక్‌సభ స్పీకర్‌ ఓంప్రకాశ్‌ బిర్లా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.