గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

వైకాపా ఫిర్యాదుపై అభిప్రాయం కోరిన స్పీకర్.. ఆర్ఆర్ఆర్‌కు లేఖ

తమ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు (నరసాపురం లోక్‌సభ సభ్యుడు)కు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా లేఖ రాశారు. రఘురామపై అనర్హత వేటు వేయాలంటూ వైకాపా ఎంపీలు స్పీకర్‌కు లేఖలు రాశారు. స్వయంగా కలిసి కూడా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రఘురామరాజు అభిప్రాయం తెలియజేయాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లా లేఖ రాశారు. 
 
15 రోజుల్లో అభిప్రాయం చెప్పాలని లేఖలో పేర్కొన్నారు. రఘురామతో పాటు టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన బెంగాల్‌ ఎంపీలు శిశిర్‌ అధికారి, సునీల్‌కుమార్‌ మండల్‌కు కూడా స్పీకర్‌ లేఖ రాశారు. అయితే తనకు ఇంకా స్పీకర్‌ లేఖ అందలేదని రఘురామకృష్ణరాజు వివరణ ఇచ్చారు.