బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 20 నవంబరు 2016 (10:34 IST)

ప్రేమిస్తావా? లేదా? ప్రేమించకపోతే చంపేస్తా.. విద్యార్థినికి వేధింపులు

మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా విద్యార్థినికి యువకుడి బెదిరింపులు వచ్చాయి. తనను ప్రేమించాలని లేదంటే చంపుతానంటూ సహ విద్యార్థినిని బెదిరిస్తున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు

మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా విద్యార్థినికి యువకుడి బెదిరింపులు వచ్చాయి. తనను ప్రేమించాలని లేదంటే చంపుతానంటూ సహ విద్యార్థినిని బెదిరిస్తున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. ఏలూరు గ్రామీణ పరిధిలో ఉన్న ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని అదే విభాగంలో చదువుతున్న సహ విద్యార్థి నరేంద్ర ప్రేమ పేరుతో కొంతకాలంగా వేధిస్తున్నాడు.
 
ప్రేమించకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడు. అతడి చేష్టలకు విసిగిపోయిన ఆమె విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకు వెళ్లింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గ్రామీణ పోలీసులు శనివారం నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.