గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 2 జులై 2017 (13:22 IST)

వరుసకు బావా మరదళ్లు.. పెళ్ళికి ఒప్పుకోలేదని ఏం చేశారో తెలుసా?

వారిద్దరూ వరుసకు బావామరదళ్లు. కానీ, పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఇక జీవించడం వృధా అనుకున్న ఆ జంట.. రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కృష్ణా జిల్లా పెదఅవుట్ పల్లి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన ఈ వివరాల

వారిద్దరూ వరుసకు బావామరదళ్లు. కానీ, పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఇక జీవించడం వృధా అనుకున్న ఆ జంట.. రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కృష్ణా జిల్లా పెదఅవుట్ పల్లి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఆగిరిపల్లి మండలం ఈదులగూడెంకు చెందిన ముల్లంగి సత్యబాబు(20), మైలవరం మండలం చంద్రాలకు చెందిన పెనుమర్తి విజయలక్ష్మీ(19) ప్రేమించుకున్నారు. వీరు వరుసకు బావా మరదళ్లు. సోమవారం విజయలక్ష్మీకి పెళ్లి నిశ్చయ తాంబూలాల కార్యక్రమం జరగనున్నట్లు సత్యబాబు తెలుసుకున్నాడు.
 
ప్రేమించిన ఆమెను బైక్‌పై ఎక్కించుకుని ఆగిరిపల్లికి తీసుకువచ్చాడు. అనంతరం ఇద్దరూ కలిసి వెళ్లి సమీపంలోని రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ప్రమాదస్థలంలో తాళిబొట్లు, వందరూపాయల నోటు లభించాయి. దీంతో వీరిద్దరికీ ఇటీవల వివాహం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.