శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 నవంబరు 2021 (11:44 IST)

ఏపీకి జవాద్‌ తుపాన్‌ ముప్పు.. 17, 18 తేదీలలో భారీ వర్షాలు

ఏపీని జవాద్‌ తుపాన్‌ ముప్పు వణికిస్తోంది. అండమాన్‌ నికోబార్‌ తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం సోమవారానికి వాయుగుండంగా మారుతుందని, ఇది మరింత బలపడి 17, 18 తేదీలలో తుపాన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు వెల్లడించారు. 
 
తుపాన్‌గా మారితే, దీనికి జవాద్‌ అని పేరును నామకరణం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీరానికి ప్రస్తుతం 1,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అల్పపీడన ప్రభావం మంగళవారం నుండి రాష్ట్రంపై పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిసింది.
 
దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, 16వ తేది విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈనెల 18వ తేది తీరం దాటే అవకాశం ఉందని అంచనా.
 
అప్పటి వరకు భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 45 నుండి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో రాష్ట్రంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారుల ఆదేశాలు జారీ చేశారు.