శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , గురువారం, 19 ఆగస్టు 2021 (10:42 IST)

మా ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్ గెల‌వాల‌ని పాద‌యాత్ర‌!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికల్లో నటుడు ప్రకాష్ రాజ్ విజయం సాధించాలని ఓ అభిమాని పాద యాత్ర ప్రారంభించాడు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వరకు ఈ పాదయాత్ర చేస్తున్నాడు.

రాజ‌మండ్రి వాసి అయిన జూనియర్ అర్టిస్ట్ రంజిత్ కుమార్ కు ప్ర‌కాష్ రాజ్ అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. ఆయ‌న న‌ట‌న‌కు ఫిదా అయిన రంజిత్ కుమార్... మా అధ్య‌క్షుడిగా ఆయ‌నే గెల‌వాల‌ని కోరుకున్నాడు. ఇందుకోసం రాజమండ్రి రూరల్ కొంతమూరు నుంచి హైదరాబాద్ వరకు ఐదు రోజుల పాటు 485 కిమీలు పాదయాత్ర చేస్తున్నాడు.

ఒక ప‌క్క మా ఎన్నిక‌లు రాజ‌కీయంగా వివాదాస్పదం కాగా, ఇందులో ప్ర‌కాష్ రాజ్ నెగ్గాల‌ని కోరుకుంటూ అభిమాని పాద యాత్ర ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో వేచి చూడాలి.