మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 ఆగస్టు 2021 (18:32 IST)

#LakhsmiDeviగా మారిన వంటలక్క.. వీడియో వైరల్

బుల్లితెరలో మంచి సక్సెస్ తో దూసుకెళ్తున్న సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులనే కాకుండా సెలబ్రిటీలను కూడా అభిమానులుగా మార్చుకుంది. ఇక ఇందులో నటించే వంటలక్క పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే.తాజాగా వరలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చింది వంటలక్క.
 
కార్తీకదీపం సీరియల్ తో తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. కేరళకు చెందిన మన వంటలక్క అక్కడ కంటే ఎక్కువ ఇక్కడే అభిమానులను సొంతం చేసుకుంది. ఇక సీరియల్‌తో పాటు తెలుగులో మరో సీరియల్‌లో కూడా అవకాశం అందుకుంది. కానీ తనకు డేట్స్ కుదరక పోవడంతో వెళ్లలేకపోయింది. ఇక ఇటీవలే మలయాళంలో దేవికా అనే సీరియల్ లో అవకాశం అందుకుంది. త్వరలోనే ఈ సీరియల్ లో నటించనుంది మన వంటలక్క.
 
సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంది. అభిమానులతో కూడా తెగ ముచ్చట్లు పెడుతుంది. ఇదిలా ఉంటే తాజాగా వరలక్ష్మి అవతారంలో అందర్నీ ఆశ్చర్యపరిచింది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా స్టార్ మాలో త్వరలోనే మా వరలక్ష్మీ వ్రతం అనే పేరుతో ఓ ఈవెంట్ చేయనున్నారు. ఇక దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.
 
ఇక అందులో తెలుగింటి ఆడపడుచులకు వరలక్ష్మి వ్రత కానుక.. లక్ష్మీ అవతారంలో దీప అంటూ లక్ష్మీదేవిగా ఎంట్రీ ఇచ్చింది వంటలక్క. ఇందులో వంటలక్క సాక్షాత్తు అమ్మవారి లాగా కనిపించడంతో వంటలక్క అభిమానుల తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 
అంతేకాకుండా మన వంటలక్క వరలక్ష్మి అక్క అయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఎటువంటి పాత్రలోనైనా వంటలక్క బాగా సెట్ అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం వంటలకు సంబంధించిన లక్ష్మీ అవతారం ఫోటో నెట్టింట్లో బాగా హల్ చల్ చేస్తుంది.