సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 12 జూన్ 2017 (09:42 IST)

ప్రేమ విఫలమైందని.. ఫ్యానుకు ఉరేసుకున్నాడు.. ప్రియురాలిని తండ్రి దూరం చేశాడని?

ప్రేమ విఫలమైందని.. ఓ యువకుడు ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా, తార్లపూడి గ్రామానికి చెందిన దాసు, మాధురి దంపతులు కూలీ పని చ

ప్రేమ విఫలమైందని.. ఓ యువకుడు ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా, తార్లపూడి గ్రామానికి చెందిన దాసు, మాధురి దంపతులు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా మాధురి సోదరుడు శాంసన్‌ తన స్వగ్రామంలో శ్రావణితో ప్రేమలో పడ్డాడు. ప్రేమ విఫలం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  
 
సూసైడ్ నోట్ కూడా రాశాడు. అందులో శ్రావణి లేకపోతే బతకలేనని.. అతని తండ్రి కందూరు కాశిరెడ్డి ఆమెను తన నుంచి దూరం చేశాడని వాపోయాడు. తమ కుటుంబాన్ని బెదిరించడంతో పాటు శ్రావణిని తనకు దూరం చేయడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపాడు. ఈ మేరకు పోలీసులు శాంసన్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.