ప్రేయసి ఇంకో వ్యక్తిని పెళ్లాడిందని.. 3ఏళ్ల కుమారుడిని కిడ్నాప్ చేశాడు
తన ప్రేయసి ఇంకో వ్యక్తిని పెళ్లాడిందనే అక్కసుతో ఓ వ్యక్తి ఆమె మూడేళ్ల కుమారుడిని కిడ్నాప్ చేసిన ఘటన ఘజియాబాద్ నగరంలో చోటుచేసుకుంది. అయితే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. నిందితుడు అరెస్టయ్యాడు
తన ప్రేయసి ఇంకో వ్యక్తిని పెళ్లాడిందనే అక్కసుతో ఓ వ్యక్తి ఆమె మూడేళ్ల కుమారుడిని కిడ్నాప్ చేసిన ఘటన ఘజియాబాద్ నగరంలో చోటుచేసుకుంది. అయితే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. నిందితుడు అరెస్టయ్యాడు. అతనిపై ఐపీసీ సెక్షన్ 363 కింద కిడ్నాప్ కేసు పెట్టారు.
వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్, మిట్టల్ కాలనీకి చెందిన ఆకాష్ తన సహచర ఉద్యోగిని అయిన పూజాకాలనీకి చెందిన ఓ మహిళను ప్రేమించి పెళ్లాడాలనుకున్నాడు.
కానీ సదరు మహిళ ఆకాష్‌ను వద్దని వేరొక వ్యక్తిని పెళ్లాడింది. దీంతో ఫైర్ అయిన ఆకాష్.. మాజీ ప్రియురాలి కుమారుడిని కిడ్నాప్ చేశాడు. కానీ బాబును తీసుకెళ్తుండగా.. పూజాకాలనీ వాసులు చూసి తల్లికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిట్టల్ కాలనీలోని ఆకాష్ ఇంటిపై దాడి చేసి బాలుడిని తీసుకొని బాధితురాలికి అప్పగించారు.