బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 20 డిశెంబరు 2021 (12:03 IST)

దేముడి మాణ్యాన్ని ర‌క్షించిన మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆర్కే

దేవాదాయ స్థ‌లాన్ని తిరిగి, ఆ శాఖ‌కు అప్ప‌గించ‌డంలో మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామ‌కృష్ణా రెడ్డి కీల‌క పాత్ర వ‌హించారు. మంగ‌ళ‌గిరిలో దాదాపు పది సంవత్సరాల నుండి గత పాలకులు ఈ శివాలయం భూమి  ఆక్రమణదారుల నుండి విడిపించ లేదు. ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే చొరవతో దేవాలఅయ ధికారులు కోర్టు ట్రిబ్యునల్ ఉత్తర్వుల ప్రకారం ఆక్రమణదారుల నుండి సుమారు 10 కోట్ల రూపాయల విలువైన 55 సెంట్ల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.

 
ఈ దేవాలయ స్థలాన్ని ఎమ్మెల్యే ఆళ్ళ రామ‌కృష్ణారెడ్డి సోమ‌వారం ప‌రిశీలించారు. ఈ 55 సెంట్ల దేవస్థాన స్థలాన్ని ఇంకెవరు ఆక్రమణ చేయకుండా శుభ్రపరిచి, అవసరమైన చోట మేరక తొలి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి మొక్కలు నాటి దేవుని యొక్క స్థలాన్ని పరిరక్షించాలని దేవాదాయ శాఖ అధికారులకు ఎమ్మెల్యే సూచనలు చేశారు. దేవాదాయ శాఖ ఆస్తుల‌ను సంర‌క్షించ‌డం ఇపుడు ప్ర‌ధాన‌మైన‌ద‌ని, నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ప‌లువురు దేవాదాయ భూముల‌ను అన్యాక్రాంతం చేసుకుని అనుభ‌విస్తున్నార‌ని పేర్కొన్నారు.