సోమవారం, 20 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 మే 2022 (15:46 IST)

విశాఖలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆందోళనలు.. జగన్ మాట తప్పారు

teachers dharna
ఏపీ, విశాఖలోని క్వీన్స్ మేరీ పాఠశాల వద్ద ఉపాధ్యాయ సంఘాలు మహానిరసన చేపట్టాయి. సీపీఎస్ రద్దు, పదో తరగతి పరీక్ష పేపర్ల వాల్యుఏషన్, ఇతర సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. తమ సమస్యలను ఎన్నో సార్లు ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అయినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఫ్యాప్టో ఇచ్చిన పిలుపుతో ఏపీలో ఉపాధ్యాయ సంఘాలు మహా నిరసనకు దిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పీఆర్సీ, డీఏలు, ఇతర రాయితీల్లో ప్రభుత్వం మొండి చేయి చూపించిందని ఉపాధ్యాయులు మండిపడ్డారు.
 
ప్రభుత్వ ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని అన్నారు. సీపీఎస్ విషయంలో ఇచ్చిన మాటను సీఎం జగన్ తప్పారని విమర్శించారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
 
పదో తరగతి పరీక్ష పత్రాల వాల్యుయేషన్‌కు సంబంధించి గతంలో 50 మార్కుల పేపర్ కు రూ. 6 ఇచ్చేవారని… ఇప్పుడు 100 మార్కుల పేపర్‌కు కూడా అంతే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.