1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 2 మే 2022 (19:29 IST)

యువజన సర్వీసుల శాఖ నేతృత్వంలో మెగా రక్తదాన శిబిరం: చదలవాడ నాగరాణి

Nagarani
రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ నేతృత్వంలో నగరంలోని కేబియన్ కళాశాలలో బుధవారం మెగా రక్త దాన శిబిరం నిర్వహిస్తున్నామని యువజన సర్వీసుల శాఖ సంచాలకులు చదలవాడ నాగరాణి తెలిపారు. పర్యాటక, సాంస్కృతిక,  యువజనాభివృద్ధి శాఖామాత్యులు ఆర్కే రోజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు.

 
ఉదయం 8.30 గంటలకు రక్తదాన శిబిరం ప్రారంభం కానుండగా యన్టీఆర్, విజయవాడ, గుంటూరు జిల్లాలకు నుండి వివిధ కళాశాలలకు చెందిన యువత, యువజన సంఘాల సభ్యులు, యన్‌సిసి బృందాల నుండి మొత్తం 300 మంది వరకు ఈ కార్యక్రమములో పాల్గొంటారని నాగరాణి తెలిపారు.

 
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా రక్తదాన ఆవశ్యకతను గుర్తించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యువజన సర్వీసుల శాఖకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారం అందిస్తున్నాయని, కార్యక్రమంలో భాగంగా అవయవ దానం ఆవశ్యకతను యువతకు తెలియచేసి, వారిని తదనుగుణంగా ముందుకు వచ్చేలా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. రక్త దాతలు, అవయవ దాతలందరికి ప్రభుత్వ పరంగా ధృవీకరణ పత్రాలు ప్రదానం చేస్తామని, ఆసక్తి ఉన్నవారు శిబిరం వద్ద నేరుగా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని చదలవాడ నాగరాణి తెలిపారు.