బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 26 సెప్టెంబరు 2020 (13:54 IST)

ఏపీ ప్రభుత్వం తరపున బాలు అంత్యక్రియలకు హాజరైన మంత్రి అనిల్

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎస్పీబీ భౌతిక కాయానికి మంత్రి అనిల్ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాలు తనయుడు చరణ్‌తో మాట్లాడారు.

మీడియాతో మంత్రి అనిల్ మాట్లాడుతూ.. నెల్లూరులో బాలు స్మృత్యర్థం ఏదైనా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని.. ఈ విషయాన్ని సీఎం వైఎస్ జ‌గ‌న్‌ దృష్టికి తీసుకువెళ్తామ‌న్నారు. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిదని తెలిపారు.