శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 14 మార్చి 2017 (16:06 IST)

ఈ ఇంట్లో అమ్మ ఫోటో పక్కన నా ఫోటో అందంగా తయారుచేయించి పెట్టు అఖిలా...

భూమా నాగిరెడ్డి తను మరికొద్ది రోజుల్లో మరణిస్తారని ముందే ఊహించారో ఏమోగానీ గత నెల రోజులుగా ఆయన అలాంటి మాటలే మాట్లాడినట్లు ఆయన కుమార్తె, ఎమ్మెల్యే అఖిలప్రియ గుర్తు చేసుకుంటున్నారు. శనివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ ముగిసిన అనంతరం ఆయన ఆ

భూమా నాగిరెడ్డి తను మరికొద్ది రోజుల్లో మరణిస్తారని ముందే ఊహించారో ఏమోగానీ గత నెల రోజులుగా ఆయన అలాంటి మాటలే మాట్లాడినట్లు ఆయన కుమార్తె, ఎమ్మెల్యే అఖిలప్రియ గుర్తు చేసుకుంటున్నారు. శనివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ ముగిసిన అనంతరం ఆయన ఆళ్లగడ్డ వచ్చేశారు. ఆ రోజు రాత్రి అఖిలప్రియతో... అమ్మ ఫోటో ప్రక్కనే నా ఫోటో కూడా పెడితే ఇంకా బావుంటుంది కదూ... అని అన్నారట. 
 
గుంటూరులో కొత్తగా నిర్మిస్తున్న ఇంటిలో భూమా శోభానాగిరెడ్డి ఫోటోను చూసి... అమ్మ పక్కనే నా ఫోటోను కూడా అందంగా తయారుచేయించి పెట్టు అఖిలా అని అన్నారట. ఆ మాటలు ఆయన అనుకోకుండా అన్నప్పటికీ అవన్నీ కీడు శంకించాయని అఖిలప్రియ గుర్తు చేసుకున్నారు. తన తండ్రి నీతి, నిజాయితీకి కట్టుబడినవారనీ, ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తానని అఖిలప్రియ అన్నారు. తన తండ్రి మరణించారన్న విషయం తలుచుకుంటే గుండె చెరువౌవుతుందనీ, కానీ నా తండ్రి ఆశయాల కోసం ఆ బాధను దిగమింగుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.