శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By srinivas
Last Modified: శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (12:16 IST)

ఆఫ్ట్రాల్ కానిస్టేబుల్‌వి.. కారు దిగమంటావా... ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు

విజయవాడ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు బందర్ లాకుల వద్ద హల్చల్ చేశారు. ఏపీ 16 సీఎం 2244 వాహనంలో ప్రభాకర్ అనుచరులు ప్రయాణం చేస్తున్నారు. బందర్ లాకుల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ పడినా కారు ఆపకుండా క్రాస్ చేసుకుంటూ వెళ్లిపోయారు. ఈ విషయాన్న

విజయవాడ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు బందర్ లాకుల వద్ద  హల్చల్ చేశారు. ఏపీ 16 సీఎం 2244 వాహనంలో ప్రభాకర్ అనుచరులు ప్రయాణం చేస్తున్నారు. బందర్ లాకుల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ పడినా కారు ఆపకుండా క్రాస్ చేసుకుంటూ వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గమనించిన కానిస్టేబుల్ కారు వద్దకు వచ్చి, కారు పక్కకు తీయమనగా కారు లోంచి దిగిన ఇద్దరు వ్యక్తులు ఆఫ్ట్రాల్  కానిస్టేబుల్‌వి.
 
నువ్వు మమ్మల్ని కారు దిగమంటావా అంటూ సదరు కానిస్టేబుల్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో  పోలీసులకు ఎమ్మెల్యే అనుచరులు మధ్య తీవ్ర  వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే అనుచరులు కానిస్టేబుల్ పైన బూతు పురాణం మొదలుపెట్టడంతో కారును పోలీస్ స్టేషనుకు తీసుకు వెళ్లాలంటూ చెప్పడంతో కానిస్టేబుల్ పైన చేయి చేసుకున్నారు ఎమ్మెల్యే అనుచరులు.
 
కానిస్టేబుల్‌కు చింతమనేని అనుచరులకు మధ్య తోపులాట జరిగింది. కారును గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీసులు. ఎమ్మెల్యే చింతమనేని అనుచరులపై గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్ అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారు.