శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Updated : బుధవారం, 19 సెప్టెంబరు 2018 (19:44 IST)

మరో ఘోరం... పరువు హత్యాయత్నం... ప్రేమికులపై కత్తితో దాడి...

సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య తర్వాత అలాంటి ఘోరమే ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎర్రగడ్డ నడి రోడ్డు మీద ఓ ప్రేమజంటపై అమ్మాయి మేనమామ ఇద్దరిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ ద

సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య తర్వాత అలాంటి ఘోరమే ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎర్రగడ్డ నడి రోడ్డు మీద ఓ ప్రేమజంటపై అమ్మాయి తండ్రి ఇద్దరిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ దాడికి కారణం ప్రేమ వ్యవహారమేనని అనుమానిస్తున్నారు.
 
నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య ఘటన మరువక ముందే.. తెలంగాణ రాజధానిలో హైదరాబాదులో మరో దారుణ హత్యాయత్నం వెలుగుచూసింది. తమకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారనే కారణంతో సందీప్(24) మాధవి(22)‌ జంటపై అమ్మాయి తండ్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. 
 
ఈ దాడిలో సందీప్, మాధవికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను స్థానికులు సనత్‌నగర్‌లోని నీలిమ ఆస్పత్రికి తరలించారు. అమ్మాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కులాంతర వివాహమే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.