మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 31 జనవరి 2018 (15:34 IST)

తెలుగు తమ్ముళ్ళే పెద్ద ఇసుక మాఫియాదారులు - రోజా ధ్వజం(Video)

టిడిపి నాయకులే ఇసుక మాఫియాకు పాల్పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు వైసిపి ఎమ్మెల్యే రోజా. చిత్తూరు జిల్లా నగరి సమీపంలోని సత్రవాడలో ఇసుకను త్రవ్వి తరలిస్తున్న ప్రాంతాన్ని రోజా పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఇసుకను త్రవ్వి కోట్

టిడిపి నాయకులే ఇసుక మాఫియాకు పాల్పడుతుంటే  ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు వైసిపి ఎమ్మెల్యే రోజా. చిత్తూరు జిల్లా నగరి సమీపంలోని సత్రవాడలో ఇసుకను త్రవ్వి తరలిస్తున్న ప్రాంతాన్ని రోజా పరిశీలించారు. 
 
తెలుగుదేశం పార్టీ నేతలు ఇసుకను త్రవ్వి కోట్లు సంపాదిస్తున్నారని, అడ్డదిడ్డంగా ఇసుక రవాణా చేయడం వల్ల కొంతమంది చిన్నారులు ఆడుకోవడానికి వెళ్ళి అందులో పడి చనిపోతున్నారని ఆరోపించారు. చంద్రబాబు వెంటనే దీనిపై స్పందించాలని ఇసుకను అక్రమంగా తరలించే వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నగరి ఎమ్మార్వో అక్రమార్కులకు అండగా నిలబడ్డారని రోజా ఆరోపించారు. వీడియోలో చూడండి.